Sivaji, Laya: 14 ఏళ్ళ తర్వాత శివాజీ-లయ కాంబినేషన్లో మూవీ..!

Sivaji, Laya: 14 ఏళ్ళ తర్వాత శివాజీ-లయ కాంబినేషన్లో మూవీ..!

Views: 42
Read Time:2 Minute, 21 Second

ఓ సినిమా హిట్ అయ్యింది అంటే.. ముఖ్యంగా అందులో హీరో, హీరోయిన్ల పెయిర్ కి కూడా మంచి మార్కులు పడ్డాయి.. మరోసారి ఆ కాంబినేషన్ ను రిపీట్ చేసి హిట్లు కొట్టాలని కొంతమంది ఫిలిం మేకర్స్ భావిస్తూ ఉంటారు. చిరంజీవి (Chiranjeevi) – విజయశాంతి (Vijayashanti) , వెంకటేష్ (Venkatesh Daggubati) – సౌందర్య (Soundarya) , నాగ చైతన్య (Naga Chaitanya) – సమంత(Samantha) .. ఇలా చెప్పుకుంటూ పోతే ఆన్ స్క్రీన్ హిట్ పెయిర్స్ చాలానే ఉన్నాయి. అందులో శివాజీ (Sivaji) – లయ కాంబినేషన్ కూడా ఒకటని చెప్పొచ్చు. ఈ కాంబినేషన్ కూడా భలే క్లిక్ అయ్యింది.నీలకంఠ తెరకెక్కించిన ‘మిస్సమ్మ’ (Missamma) సినిమాలో మొదటిసారి కలిసి నటించారు శివాజీ, లయ (Laya). ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది.

ఈ జంటకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత ఇదే కాంబినేషన్ ను ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ ‘అదిరిందయ్యా చంద్రం’ సినిమాల్లో రిపీట్ చేశారు. ఆ సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. 2010 లో శివాజీ హీరోగా వచ్చిన ‘బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం’ సినిమా కూడా డీసెంట్ సక్సెస్ అందుకుంది.అందులో కూడా లయ ఓ చిన్న పాత్ర పోషించింది. ఇదిలా ఉండగా.. 14 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఈ జంట కలిసి నటించబోతోంది. వివరాల్లోకి వెళితే.. శివాజీ ప్రధాన పాత్రలో ఓ క్రైమ్ థ్రిల్లర్ రూపొందుతుంది. ఈ ప్రాజెక్టుని శివాజీనే నిర్మిస్తుండటం విశేషంగా చెప్పుకోవాలి. ‘శ్రీ శివాజీ ప్రొడక్షన్స్’ బ్యానర్ పై శివాజీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. సుధీర్ శ్రీరామ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఆగస్టు 20 నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *