రాఖీ పండుగ (Rakhi Celebrations) మన భారతీయులందరికీ చాలా స్పెషల్ అని చెప్పుకోవాలి. అక్క లేదా చెల్లి.. తమ అన్న లేదా తమ్ముడికి రాఖీ కట్టి.. వాళ్ళు ఎటువంటి లోటుపాట్లు లేకుండా కలకాలం సంతోషంగా, సుఖంగా జీవించాలని కోరుకుంటారు. ఇక అమ్మలో సగం… నాన్నలో సగం అయ్యి కష్టసుఖాల్లో కలకాలం తమ సోదరీమణులకు తోడుగా ఉంటామని అన్న లేదా తమ్ముడు ఇచ్చే నమ్మకం.. కూడా ఈ రాఖీ పండుగకి గుర్తుగా ఉంటుంది. ఈ ఆగస్టు 19న… సామాన్యులు మాత్రమే కాదు సినీ సెలబ్రిటీలు సైతం రాఖీ పండుగను స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకున్నారు.
వెండితెరకి చెందిన స్టార్లు కావచ్చు.. బుల్లితెరకి చెందిన స్టార్లు కావచ్చు.. అందరూ కూడా ఈ రాఖీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) తమ సోదరీమణులు ప్రసీద, ప్రదీప్తిలతో రాఖీ కట్టించుకున్నాడు. సాధారణంగా ఫ్యామిలీతో ప్రభాస్ గడిపిన క్షణాలకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకోడానికి ప్రభాస్ ఇష్టపడడు.
అయినప్పటికీ ఈసారి తమ ఇంట్లో జరిగిన రాఖీ సెలబ్రేషన్స్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మహేష్ బాబు కొడుకు గౌతమ్.. అతని చెల్లెలు సితారతో రాఖీ కట్టించుకున్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే వరుణ్ తేజ్ (Varun tej)- నిహారిక (Niharika) ..ల రాఖీ సెలబ్రేషన్స్, రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) తన సోదరుడికి రాఖీ కట్టినప్పుడు తీసుకున్న ఫోటోలు.. ఇంకా చాలా మంది బుల్లితెర సెలబ్రిటీలకు సంబంధించిన రాఖీ సెలబ్రేషన్స్ (Rakhi Celebrations) పిక్స్ కూడా ఇప్పుడు వైరల్ గా మారాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :