నాగ చైతన్య (Naga Chaitanya) , – శోభిత ధూళిపాళ్ల (Sobhita Dhulipala)… డేటింగ్లో ఉన్నారని రెండేళ్లుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో వీళ్ళు సన్నిహితంగా ఉన్న ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. కానీ మీడియా ముందు మాత్రం వీళ్ళు ఓపెన్ అవ్వలేదు. విషయాన్ని చాలా గోప్యంగా ఉంటూ వచ్చారు. ఫైనల్ గా ఆ గాసిప్పులు నిజమయ్యాయి. హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల.. అక్కినేని వారి ఇంటి కోడలు అవుతుంది.
ఈరోజు అనగా 8-8 -8 ఉదయం 9 గంట 42 నిమిషాలకు నాగార్జున ఇంట్లో ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో చైతన్య- శోభిత..ల నిశ్చితార్థం నిరాడంబరంగా జరిగింది.‘మా కుటుంబంలోకి శోభితను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము’ అంటూ నాగార్జున (Nagarjuna) ఈ ఎంగేజ్మెంట్ కి సంబంధించి కొన్ని ఫోటోలు షేర్ చేసి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అయితే పెళ్లి ఎప్పుడు అనే విషయం పై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ‘8-8 -8 తేదీ చాలా మంచి రోజు అని..ఈరోజు ఎంగేజ్మెంట్ చేస్తే జీవితాంతం నూతన వధూవరులు ఆనందంగా ఉంటారు’ అక్కినేని వారి ఆస్థాన పంతులు చెప్పడంతో ఈరోజు నిశ్చితార్ధ వేడుకను నిర్వహించినట్టు తెలుస్తుంది.ఇక చైతన్య- శోభిత..ల పెళ్లి వేడుకను విదేశాల్లో నిర్వహించాలని కూడా నాగార్జున భావిస్తున్నారట. ప్రస్తుతం నాగ చైతన్య ‘తండేల్’ (Thandel) సినిమా షూటింగ్లో బిజీగా గడుపుతున్నారు. సెప్టెంబర్ ఎండింగ్ కి అతని పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత నాగ చైతన్య పెళ్ళికి ఏర్పాట్లు జరిగే ఛాన్స్ ఉంది. ప్రస్తుతానికైతే నిశ్చితార్థం ఫోటోలు వైరల్ అవుతున్నాయి.