రీరిలీజ్‌ల ట్రెండ్ ఫుల్ స్వింగ్‌లో నడుస్తోంది. ఆ మధ్య కొన్ని సినిమాలు సరిగ్గా ఆడకపోవడంతో తేడా కొట్టేసింది.. ఇక రీరిలీజ్‌ల నడవవు అని అనుకున్నారంతా. అయితే ‘మురారి’ (Murari) సినిమా రికార్డులు సృష్టించడంతో మరోసారి ఆ ట్రెండ్ స్వింగ్‌లోకి వచ్చింది. దీంతో రాబోయే రోజుల్లో పుట్టిన రోజులు ఉన్న హీరోల అభిమానులు రీరిలీజ్‌ల కోసం ఎదురుచూస్తున్నారు. అలా నాగార్జున (Nagarjuna) అభిమానులు కూడా వెయిట్ చేస్తున్నారు. ఏ సినిమా వస్తుందా అని అనుకుంటున్నారు.వారి ఆలోచనలకు, ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్ పెడుతూ అప్‌డేట్ వచ్చేసింది. నాగార్జున – లారెన్స్ (Raghava Lawrence) కాంబినేషన్‌లో తెరకెక్కి అదిరిపోయే విజయం అందుకున్న ‘మాస్’ (Mass) సినిమాని నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయనున్నారు.
ఆయన బర్త్‌డేకి ఒక రోజు ముందు అంటే ఆగస్టు 28న ఈ సినిమా రీ రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. 2004లో విడుదలై యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఆదరణ పొందిన సినిమా ‘మాస్’. నాగార్జున సొంతంగా నిర్మించిన ఈ సినిమాలో జ్యోతిక (Jyothika) , ఛార్మి (Charmy Kaur) , రఘువరన్ (Raghuvaran) , ప్రకాష్‌రాజ్ (Prakash Raj) , రాహుల్ దేవ్ (Rahul Dev) కీలకపాత్రలు పోషించారు.అప్పట్లో అంత విజయం సాధించిన ఈ సినిమా ఇప్పుడు వచ్చి ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి. నాగార్జున సినిమాల రీరిలీజ్‌ల విషయంలో ఈ సినిమా ట్రెండ్ సెట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక ఈ సినిమా వచ్చి చాలా రోజులు అయింది కదా. ఓసారి కథాంశం చూస్తే.. గణేశ్ (నాగార్జున) ఒక అనాధ. అతనికి ఆది (సునీల్) మంచి స్నేహితుడు.ఓ రోజు అనుకోకుండా వైజాగ్ మాఫియా డాన్ సత్య(రఘువరన్) కుమార్తె అంజలి (జ్యోతిక)ని చూసిన గణేశ్ ప్రేమలో పడతాడు. ఆమె కూడా గణేశ్ ప్రేమలో పడుతుంది. ఇద్దరు పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటారు. ఈ విషయం తెలిసి అంజలిని తీసుకెళ్లే క్రమంలో ఆదిని హత్య చేస్తారు. తన ప్రాణ స్నేహితుడుని చంపిన వారిని.. గణేశ్ ఎలా చంపాడు. తన ప్రేమను ఎలా సాధించుకున్నాడు అనేది సినిమా (Mass) కథ. ఈ క్రమంలో వచ్చే ఛాలెంజ్‌లు, వార్నింగ్‌లు, ఛేజింగ్‌లు.. భలే ఉంటాయి.