Bhale Unnade Trailer Review: వింత పాత్రలో రాజ్ తరుణ్.. ట్రైలర్ ఇలా ఉందేంటి?

Bhale Unnade Trailer Review: వింత పాత్రలో రాజ్ తరుణ్.. ట్రైలర్ ఇలా ఉందేంటి?

Views: 115
Read Time:2 Minute, 15 Second

దర్శకుడు మారుతి (Maruthi) ఎంపిక చేసుకునే కాన్సెప్ట్..లు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. సెన్సిటివ్ టాపిక్ ను ఎంపిక చేసుకున్నప్పటికీ తన మార్క్ ఎంటర్టైన్మెంట్ తో స్క్రీన్ ప్లేని డిజైన్ చేసుకుంటూ ఉంటాడు. మతి మెరుపు కాన్సెప్ట్ తో ‘భలే భలే మగాడివోయ్’ (Bhale Bhale Magadivoy), ఓసిడి కాన్సెప్ట్ తో ‘మహానుభావుడు’ (Mahanubhavudu) వంటి సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు మారుతి. అతను డైరెక్ట్ చేసే సినిమాలు మాత్రమే కాదు.. అతను సమర్పణలో రూపొందే సినిమాలు కూడా ఇలానే ఉండేలా చూసుకుంటాడు మారుతి.ఇప్పుడు కూడా తన మార్క్ సెన్సిటివ్ కాన్సెప్ట్ తో ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు మారుతి. అదే ‘భలే ఉన్నాడే’. రాజ్ తరుణ్ (Raj Tarun) హీరోగా నటిస్తున్న.

ఈ చిత్రానికి జె.శివ సాయి వర్ధన్ దర్శకుడు. సెప్టెంబర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘భలే ఉన్నాడే’ కి సంబంధించిన ట్రైలర్ ని వదిలారు.2 నిమిషాల 54 సెకన్ల నిడివి కలిగిన ఈ ట్రైలర్.. కొంచెం ఫన్ తో, ఇంకొంచెం ఎమోషన్ తో నిండి ఉంది. ఇందులో హీరో రాజ్ తరుణ్.. అమ్మాయిలంటే ఇబ్బంది పడే అబ్బాయిగా కనిపిస్తున్నాడు. అలా అని ‘మన్మథుడు’ లో నాగార్జున (Nagarjuna) టైపు పాత్ర కాదు, కొంచెం వింతగా ప్రవర్తించే పాత్ర అనమాట.అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుని హీరోయిన్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది? అసలు హీరోకి ఉన్న సమస్య ఏంటి? అనేది మిగిలిన కథగా తెలుస్తుంది. ఈ సినిమా అయినా హిట్ అయ్యి రాజ్ తరుణ్ ని ప్లాపుల నుండి బయట పడేస్తుందేమో చూడాలి.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *