పవన్ (Pawan Kalyan) శ్రియ (Shriya Saran) కాంబినేషన్ లో తెరకెక్కిన బాలు (Balu) సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ రిజల్ట్ ను అందుకున్నా పవన్ అభిమానులకు ఎంతో నచ్చిన సినిమాలలో ఈ సినిమా ఒకటనే సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో అద్భుతమైన ఫలితాలు సాధించి డిప్యూటీ సీఎం కావడం గురించి శ్రియ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అద్భుతమైన విజయాన్ని అందుకున్నారని శ్రియ తెలిపారు. పవన్ కళ్యాణ్ విషయంలో నేనెంతో గర్వంగా ఉన్నానని శ్రియ కామెంట్లు చేశారు.
నేను, పవన్ గతంలో బాలు అనే సినిమా కోసం వర్క్ చేశామని శ్రియ చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ శ్రమపడే మనస్తత్వం ఉన్న వ్యక్తి అని సెట్ లో సైలెంట్ గా ఉండేవారని శ్రియ పేర్కొన్నారు. బాలు సినిమాలోని ఒక పాట షూట్ సమయంలో పవన్ కళ్యాణ్ కాలికి గాయమైందని శ్రియ చెప్పుకొచ్చారు. పాట షూట్ పూర్తయ్యే వరకు పవన్ ఆ విషయం ఎవరికీ చెప్పలేదని శ్రియ వెల్లడించారు.
ప్రజలకు మంచి చేయాలని పవన్ ఎప్పుడూ తాపత్రయపడేవారని ఆమె పేర్కొన్నారు.ప్రజలు పవన్ కళ్యాణ్ ను ఎన్నుకోవడం సంతోషంగా ఉందని పవన్ అద్భుతాలు సృష్టిస్తారని నేను నమ్ముతానని శ్రియ వెల్లడించారు. శ్రియ చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి. చిరంజీవితో (Chiranjeevi) కలిసి మరో సినిమాలో నటించాలని భావిస్తున్నానని శ్రియ పేర్కొన్నారు. శ్రియ ప్రస్తుతం తెలుగులో పరిమితంగా సినిమాలలో నటిస్తున్నారు.గతంతో పోల్చి చూస్తే శ్రియకు కొంతమేర ఆఫర్లు తగ్గాయనే చెప్పాలి. బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం ఆఫర్లతో బిజీగా ఉన్న శ్రియ షో టైమ్ అనే కార్యక్రమం కోసం తాను వర్క్ చేస్తున్నానని వెల్లడించారు. సినిమాకు భాషతో సంబంధం లేదని నాకు ఇండియన్ సినిమా అంటే ఇష్టమని శ్రియ చెప్పుకొచ్చారు.