టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్లలో ఒకరైన సమంతకు (Samantha) ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉండగా సిటాడెల్ హనీబన్నీ సిరీస్ తో సమంత త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ ఏడాది నవంబర్ నెల 7వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వేదికగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. అయితే ఈ వెబ్ సిరీస్ కోసం సమంత 10 కోట్ల రూపాయల పారితోషికం అందుకున్నారని తెలుస్తోంది. వాస్తవానికి సౌత్ లో కొంతమంది హీరోయిన్లు ఇదే స్థాయిలో పారితోషికం తీసుకుంటున్నారని ప్రచారం జరిగినా ఆ ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదు.
రెమ్యునరేషన్ విషయంలో వాళ్ల కంటే సామ్ టాప్ అని సమంత చరిత్ర సృష్టించారని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సమంత నటించిన ఫ్యామిలీ మేన్ సీజన్2 సక్సెస్ సాధించడం వల్లే ఆమెకు ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ దక్కింది. సమంత బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ లతో రాబోయే రోజుల్లో కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకోనున్నారో చూడాల్సి ఉంది. త్వరలో సమంత రెగ్యులర్ షూటింగ్ లతో బిజీ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.సమంత సినిమాలకు మాత్రం 3 నుంచి 4 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారని సమాచారం అందుతోంది. సమంత మా ఇంటి బంగారం అనే ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నారు. సమంతకు సోషల్ మీడియాలో సైతం మైండ్ బ్లాంక్ అయ్యే స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సమంత కథ అద్భుతంగా ఉంటే లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్స్ లో సైతం నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. సమంత వయస్సు పెరుగుతున్నా ఇప్పటికీ యంగ్ లుక్ లోనే కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. టాలీవుడ్ టాప్ స్టార్స్ కు జోడీగా సమంత నటించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.