తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పటి సీనియర్ నటుడు రాజేష్ కుమార్తె అయిన ఐశ్యర్య కేవలం హీరోయిన్ గానే కాకుండా క్యారెక్టర్ కిి ఇంపార్టెన్స్ ఉండే మూవీస్, లేడీ ఓరియంటెడ్ ఫిలింస్ చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ‘రాంబంటు’ సినిమాలో ఛైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించిన ఆ తరువాత ఐశ్వర్య 2010 నుండి తమిళనాట కెరీర్ స్టార్ట్ చేసింది. 2019లో ‘కౌసల్య కృష్ణమూర్తి’ తో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది.‘వరల్డ్ ఫేమస్ లవర్’ (World Famous Lover) , ‘టక్ జగదీష్’ (Tuck Jagadish) , ‘రిపబ్లిక్’ (Republic) ‘సుడల్’ , డ్రైవర్ జమున సినిమాలో తన నటనతో తెలుగు ఆడియన్స్ ని ఆకట్టుకుంది ఈ చిన్నది. ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాలతో ఈ బ్యూటీ బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ సాధించింది.
సినిమాల్లో పద్దతిగా కనిపించే ఐశ్వర్య రాజేష్ ఇప్పుడు గ్లామర్ డోస్ పెంచి షాకిచ్చింది. ఇటీవల మోడ్రన్ డ్రెస్ లో ఐశ్వర్య రాజేష్ షేర్ చేసిన ఫోటోలు ఓ రేంజ్లో వైరల్ అవుతున్నాయి. థైస్ అందాలతో మత్తెక్కించే ఫోజులు ఇచ్చింది.