Ruhani Sharma: రుహాని శర్మ నుండి ఇలాంటి సీన్స్ ఊహించలేదు కదా..!

Ruhani Sharma: రుహాని శర్మ నుండి ఇలాంటి సీన్స్ ఊహించలేదు కదా..!

Views: 43
Read Time:2 Minute, 22 Second

రుహాని శర్మ (Ruhani Sharma) .. ‘చి ల సౌ’ అనే సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో ఈమె ఓ మిడిల్ క్లాస్ అమ్మాయిగా.. చాలా అంటే చాలా సింపుల్ గా, ఇంకా చెప్పాలంటే సహజంగా కనిపించింది. తల్లి మానసిక పరిస్థితి కారణంగా పెళ్లి కాకుండా ఇబ్బంది పడే నిస్సహాయ స్థితిలో ఉన్న ఓ అమ్మాయిగా రుహాని నటన ఆ సినిమాకే హైలెట్ గా నిలిచింది. ‘చి ల సౌ’ చూసిన వాళ్ళు అందులో రుహాని శర్మ అమాయకపు లుక్స్ ని, ఎక్స్ప్రెషన్స్ ని.. అంత ఈజీగా మర్చిపోలేరు.కానీ ‘ఆ ఇమేజ్ కి స్టిక్ అయిపోకూడదు’ అని భావించో ఏమో కానీ.. తర్వాత ‘హిట్’ వంటి కొన్ని సినిమాల్లో ఆమె మోడ్రన్ గా కనిపించిన సందర్భాలు ఉన్నాయి.

‘చి ల సౌ’ సినిమాలో మాదిరి రుహాని శర్మని అంత నేచురల్ గా ఏ దర్శకుడు ప్రెజెంట్ చేయలేదు. సో రుహాని మిస్టేక్ లేనట్టే..! ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే..! రుహాని శర్మకి సంబంధించిన కొన్ని బెడ్ రూమ్ సీన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.‘ఆగ్ర’ అనే సినిమాకు సంబంధించిన సీన్స్ అవి. రుహాని శర్మ.. ఎన్నడూ లేని విధంగా ఆ సినిమాలో లవ్ మేకింగ్ సీన్స్ లో నటించడంతో.. ఆ వీడియోలు చూసిన వారంతా షాక్ కి గురవుతున్నారు. ‘ఆమె ఎందుకు ఇలాంటి బోల్డ్ స్టెప్ తీసుకుందా?’ అని అంతా ఆశ్చర్యపోతున్నారు. వాస్తవానికి రుహాని శర్మ థియేటర్ ఆర్టిస్ట్. ఆమె నటన బాగుంటుంది. ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగల సమర్థురాలు. అయినా సరే ఇలాంటి బోల్డ్ రోల్స్ పై ఆధారపడాల్సి వచ్చింది అంటే..టాలీవుడ్ దర్శకుల తప్పు కూడా ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *